English  తెలుగు

మన చుట్టూ ఉన్న అద్భుతం: పర్యావరణం

మన చుట్టూ ఉన్న గాలి, నీరు, నేల, చెట్లు – ఇవన్నీ కలిపి ఒక అద్భుతాన్ని సృష్టిస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? అదే పర్యావరణం. సింపుల్ గా చెప్పాలంటే, పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న జీవ, నిర్జీవ వస్తువుల కలయిక. 

Click here to Read the English version of this article.

ప్రతి జీవి తనదైన పర్యావరణంలోనే బ్రతుకుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, “Environment” అనే ఇంగ్లీష్ పదం ఫ్రెంచ్ భాషలోని “Environ” నుండి వచ్చింది. దీని అర్థం “చుట్టూ ఆవరించి ఉండటం”.

Garbage is piling up… Where is the solution?
చెత్త పెరుగుతోంది… పరిష్కారం ఎక్కడ?

సహజసిద్ధ పర్యావరణం అనేది, ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా భూమిపై సహజంగా ఏర్పడిన అనుకూల శీతోష్ణ పరిస్థితుల వల్ల ఉద్భవించిన పర్యావరణం. దీనిని నాలుగు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. అవి – శిలావరణం (Lithosphere), జలావరణం (Hydrosphere), వాతావరణం (Atmosphere), జీవావరణం (Biosphere). 

మనం నివసించే నేల శిలావరణం, ప్రాణాధారమైన నీరు ఉండే జలావరణం, మనం పీల్చే గాలి పొరలున్న వాతావరణం(ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్ – ఐదు పొరల సమ్మేళనం) మరియు సమస్త జీవకోటి నివసించే జీవావరణం

జీవావరణ శాస్త్రం: ప్రకృతితో మన బంధం!
జీవావరణ శాస్త్రం: ప్రకృతితో మన బంధం!

ఈ నాలుగు విడివిడిగా కాకుండా, ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తూ భూమిపై జీవానికి అనువైన పరిస్థితులను సృష్టిస్తాయి. ఇది ప్రకృతిలో జరిగే అతిపెద్ద సమన్వయ కార్యం. 

కానీ మన చర్యలు దీన్ని మారుస్తున్నాయి. మనం ఈ సమతుల్యతను ఎంతవరకు కాపాడుతున్నాం? అయితే, ఈ సున్నితమైన సమతుల్యతకు ఎప్పుడైనా భంగం వాటిల్లితే ఏం జరుగుతుంది? ప్రశ్న మన ముందుంది… జవాబు మన చర్యల్లో దాగి ఉంది.

📢 పర్యావరణ సమతుల్యతకు మీరు ఒక పేరు పెట్టాలంటే ఏం పెడతారు?
💬 కామెంట్స్‌లో రాసి, కొత్త ఆలోచనలకు దారి తీసుకుందాం!