English  తెలుగు

రక్తం: మనల్ని బతికించే నిశ్శబ్ద నది!

మీ శరీరంలో ప్రవహిస్తూ ప్రతి కణానికి జీవం ఇచ్చేది ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానం రక్తం. ఇది కేవలం ఎరుపు రంగు ద్రవం కాదు, ప్రతి క్షణం ప్రాణాలను కాపాడే సంక్లిష్టమైన కణజాలం. 

Click here to Read the English version of this article.

ఒక సాధారణ వ్యక్తిలో రక్తం శరీర బరువు లో సుమారు 7%(శాతం) మరియు దాదాపు 5 లీటర్ల పరిమాణం కలిగి ఉంటుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది – ప్లాస్మా (సుమారు 55%), ఇది ప్రధానంగా నీటితో (92%) కూడి ఉంటుంది, అలాగే ప్రోటీన్లు, అయాన్లు, గ్లూకోస్ మరియు హార్మోన్లు కలిగి ఉంటుంది. మిగతా భాగం (సుమారు 45%) ఏర్పడిన మూలకాలు అనగా – ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు రక్త కణికలు (ప్లేట్లెట్లు). 

ఎర్ర రక్త కణాలు (RBCలు), లేదా ఎరిథ్రోసైట్లు, అత్యంత సమృద్ధిగా ఉండే రక్త కణాలు మరియు హిమోగ్లోబిన్ ప్రోటీన్ కారణంగా ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. ఊపిరితిత్తుల నుండి శరీర కణజాలాలకు ఆక్సిజన్‌ను రవాణా చేయడం మరియు కార్బన్ డయాక్సైడ్‌ను తిరిగి ఊపిరితిత్తులకు తీసుకెళ్లడం వీటి ప్రధాన విధి. ఎముక మజ్జలో ఉత్పత్తి అయ్యే ఇవి, వాయు మార్పిడిని మెరుగుపరిచే బైకాన్కేవ్ డిస్క్ ఆకారాన్ని కలిగి ఉంటాయి. వీటిలో కేంద్రకం ఉండదు మరియు వాయు మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయడానికి కార్బోనిక్ అన్హైడ్రేస్ అనే ఎంజైమ్‌ను కలిగి ఉంటాయి. 

తెల్ల రక్త కణాలు (WBCలు), లేదా ల్యూకోసైట్లు, రక్తంలో ఒక చిన్న భాగం (1% కంటే తక్కువ) కానీ శరీర రక్షణకు చాలా ముఖ్యమైనవి. ఇవి రంగులేనివి, హిమోగ్లోబిన్ ఉండదు మరియు శరీరాన్ని ఇన్ఫెక్షన్లు మరియు పరాన్నజీవుల నుండి రక్షిస్తాయి. WBCలలో గ్రాన్యులోసైట్లు అనగా  – న్యూట్రోఫిల్స్ (ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి), ఈసినోఫిల్స్ (శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడతాయి), బాసోఫిల్స్ (అలెర్జీలకు  ప్రతిస్పందిస్తాయి), మరియు అగ్రన్యులోసైట్లు అయినటువంటి లింఫోసైట్లు (రోగనిరోధక శక్తిని అందిస్తాయి), మోనోసైట్లు (సూక్ష్మక్రిములను మింగేస్తాయి) కలిగి ఉంటాయి. 

రక్త కణికలు (ప్లేట్లెట్లు) లేదా థ్రోంబోసైట్లు రక్తంలోని చిన్న కణ భాగాలు. వీటి ప్రధాన కర్తవ్యం రక్తం గడ్డకట్టేలా చేసి రక్తస్రావం ఆగేలా చేయడం. ఇది అధిక రక్తం మరియు ఇతర శరీర ద్రవాలను కోల్పోకుండా నిరోధిస్తుంది. 

రక్తం కొద్దిగా క్షారత్వం (pH 7.35 – 7.45) కలిగి ఉంటుంది. గుండె, రక్త నాళాల ద్వారా రక్తాన్ని  నిరంతరం శరీర భాగాలకు పంప్ చేస్తుంది. ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్న రక్తం తేజోవంతమైన ఎరుపు రంగులో ఉంటుంది, ఆక్సిజన్ తక్కువగా ఉన్న రక్తం గాఢ ఎరుపు రంగులో కనిపిస్తుంది.

📢 అందువల్ల రక్తం కేవలం ద్రవం కాదు. అది జీవమే మరియు పగలు రాత్రి అని తేడా లేకుండా మన శరీరంలో ఆగకుండా ప్రవహిస్తూ మనల్ని బ్రతికిస్తుంది.
💬 మీ అభిప్రాయం ఏమిటి? క్రింద కామెంట్ చేయండి!

Leave a Comment