మీరు రోజూ వేసే చెత్త ఎక్కడికి వెళ్తుందో తెలుసా? అసలు వెళ్తుందా లేక మన చుట్టూ పేరుకుపోతూనే ఉందా? ఇదే ఘన వ్యర్థాల సమస్య.
Click here to Read the English version of this article.
ఘన వ్యర్థాలు అంటే మానవ కార్యకలాపాల ఫలితంగా గృహ, పారిశ్రామిక, వాణిజ్య, వైద్య, వ్యవసాయ రంగాల నుండి ఉత్పన్నమయ్యే ఉపయోగం లేని పదార్థాలు. వీటిలో చెత్త, ప్లాస్టిక్, కాగితం, గాజు, లోహాలు, ఆహార అవశేషాలు, నిర్మాణం మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు మొదలైనవి ఉంటాయి.
ఘన వ్యర్థాలను సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల భూమి, నీరు, గాలి కాలుష్యం ఏర్పడి, పర్యావరణం మరియు మానవ ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. ఇది నేల సారాన్ని తగ్గించి, జలాలను కలుషితం చేసి, విషపూరిత వాయువులు విడుదల చేస్తుంది.
భారతదేశంలో ప్రతిరోజూ దాదాపు 17,600 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నది. ఇది సంవత్సరానికి 62 మిలియన్ టన్నుల చెత్త. వీటిలో సుమారు 43 మిలియన్ టన్నులు అనగా 70% సేకరించబడుతున్నాయి. ఇందులో సుమారు 12 మిలియన్ టన్నులు శుద్ధి చేయబడుతున్నాయి. మిగతావి నగర శివార్లలో డంప్ చేస్తున్నారు.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) రిపోర్ట్ ప్రకారం అత్యధికంగా ఘన వ్యర్ధాలను ఉత్పత్తి చేసే నగరాలు – ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్ మరియు ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే రాష్ట్రాలు – మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. అధిక జనాభా, పట్టణీకరణ, వినిమయ జీవనశైలి, సాంకేతిక పరిజ్ఞానము ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి.
ఇక పరిష్కారం ఏమిటి? ఘన వ్యర్థాల నిర్వహణ. దీని ద్వారా ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా సేకరించడం, వేరుచేయడం, రవాణా చేయడం, శుద్ధి చేయడం మరియు సురక్షితంగా పారవేయడం. తగ్గించడం (Reduce), పునర్వినియోగించడం (Reuse), మరియు పునఃచక్రీయం (Recycle) అనే ‘3R’ సూత్రంతో పాటు కంపోస్టింగ్, రీసైక్లింగ్, బయోగ్యాసిఫికేషన్ వంటి పద్ధతులు చెత్తను సంపదగా మార్చి పర్యావరణాన్ని కాపాడుతాయి.
ప్రశ్న మాత్రం మిగిలిందే – మన చెత్తను మనమే అదుపులో పెట్టుకోకపోతే, రేపటి రోజున మన భూమి చెత్తలో మునిగిపోవడం తప్పదా?
🗑️ ఘన వ్యర్థాల సమస్యకు ఒక చిన్న పరిష్కారం మీరు సూచిస్తే అది పెద్ద మార్పు తేవచ్చు.
💡 మీ ఐడియా ఏమిటి? 💬 కింద కామెంట్స్‌లో పంచుకోండి…
