1453లో ఒక సంఘటన యూరోప్ చరిత్రనే మార్చేసింది. ఒట్టోమన్ సుల్తాన్ ‘రెండవ మహమ్మద్ (Mehmed II)’ కానెస్టాంటినోపుల్ (ప్రస్తుత టర్కీ)ను ఆక్రమించడంతో, యూరప్-సెంట్రల్ ఆసియా భూమార్గం మూసుకుపోయింది. అప్పుడు సముద్ర మార్గం కోసం అన్వేషణ మొదలైంది.
Click here to Read the English version of this article.
పోర్చుగల్ రాజు హెన్రీ (బిరుదు: ది నావిగేటర్) నౌకాయానం ను మొదటగా ప్రోత్సహించాడు. 1487లో బార్తలోమియాదయాజ్ ఆఫ్రికా చివర చేరి ‘కేప్ ఆఫ్ స్ట్రామ్స్’ కనుగొన్నాడు. అదే తర్వాత ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ గా ప్రసిద్ధి చెందింది. ఇదే ఆసియాకు సముద్ర ద్వారం.
కొలంబస్ భారత్ వైపు బయలుదేరినా దారి తప్పి అమెరికాను కనుగొన్నాడు. కానీ అసలైన గమ్యానికి చేరింది ‘వాస్కోడి గామా’. వాస్కోడి గామా లిస్బన్ నుండి బయలుదేరి, శాన్ గాబ్రియల్ నౌకలో, భారత తీరాలకు చేరుకున్నాడు. 1498, మే 17న ఆయన కాలికట్ చేరుకున్నప్పుడు, అక్కడి పాలకుడు జమోరిన్ స్వాగతం పలికారు. ఆ క్షణం నుండి భారతదేశంలో యూరోపియన్ల అధ్యాయం ప్రారంభమైంది.
1502లో రెండోసారి వచ్చి, 1524లో మలేరియా తో వాస్కోడి గామా మరణించాడు. ఇతని సమాధి కొచ్చిన్ లో ఉంది.
పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డానిష్, ఫ్రెంచ్ వరుసగా ఇండియా వచ్చారు. ఆంధ్రలో మొదట డచ్, తర్వాత బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్.
సముద్ర తుఫాన్లతో పోరాడుతూ, తెలియని ఖండాలను చేరుకుంటూ సాగిన ఈ యాత్రలు కేవలం వాణిజ్య గాథలేనా? లేక కొత్త యుగానికి నాంది వేయించాయా? తెలుసుకోవాలంటే చరిత్ర పుటల్లోకి ఇంకాస్త లోతుగా వెళ్లాలి!
📢 ఈ యూరోపియన్ల ప్రయాణంలో మీకు తెలిసిన కొత్త విషయమేమిటి!
💬 కింద కామెంట్లో తెలపండి…
