English  తెలుగు

గుమ్మడికాయ నుండి గర్జించే సామ్రాజ్యం, మూడు కథలు, ఒక రాజవంశం: కాకతీయుల పేరు రహస్యం!

ఒక రాజవంశం పేరు వెనుక దేవత, గుమ్మడికాయ, పట్టణం అనే మూడు కథలు దాగుంటాయని ఎప్పుడైనా అనుకున్నారా? అదే కాకతీయుల చరిత్రలోని అసలు సిసలు ట్విస్ట్!

Click here to Read the English version of this article.

శాతవాహనుల తర్వాత తెలుగు నేల మొత్తాన్ని ఒక్కతాటిపైకి తెచ్చిన ఘనత కాకతీయులది. వీరి కాలంలోనే ‘ఆంధ్ర – త్రిలింగ’ పదాలు జాతి – దేశ సమానార్థకాలుగా మారాయి. 

“ఆంధ్రదేశాధీశ్వర” అనే బిరుదుతో ఓరుగల్లు (ఆంధ్రనగరి) నుండి పాలించారు. ఇవాళ మనం ‘వరంగల్’ అని పిలుచుకుంటున్న నగరం. ఉత్తరాది నుండి వస్తున్న ముస్లిం దండయాత్రలను దక్షిణ భారతంలో అడ్డుకున్న వీరోచిత చరిత్ర వీరిది.

మరి వీరి పేరు ఎలా వచ్చింది? దీని వెనుక మూడు కథలు ప్రచారంలో ఉన్నాయి! 

ఆంధ్రప్రదేశ్ అన్'స్టాపబుల్': 70 ఏళ్లలో ఎన్నో మలుపులు!
ఆంధ్రప్రదేశ్ అన్’స్టాపబుల్’: 70 ఏళ్లలో ఎన్నో మలుపులు!

మొదటిది – కాకతి అనే దుర్గాదేవిని పూజించడం వల్ల ‘కాకతీయులు’గా  పిలువబడ్డారు. ఓరుగల్లులో కాకితమ్మ ఆలయం ఉందని వినుకొండ వల్లభాచార్యుడు తన ‘క్రీడాభిరామం’లో చెప్పారు.

రెండోది – ‘కాకతి’ అంటే కూష్మాండ (గుమ్మడి) అని అర్థం. జైన తీర్థంకరులలో 22 వ వారు అయిన నేవినాధుని శాసనాధికారిణి కూష్మాండిని. మొదట జైనులుగా ఉండి, శైవమతం స్వీకరించిన వీరు, పాత సంప్రదాయాన్ని వదల్లేక కూష్మాండ దేవతను కాకితమ్మ అనే దుర్గాదేవిగా పూజించారు.

మూడోది – ‘కాకతిపురం’ నుండి పాలించడం వల్ల ఈ పేరు వచ్చిందని బయ్యారం చెరువు శాసనంలో తెలుపు బడింది.

కాకతీయుల గాధ కేవలం ఒక రాజవంశం కథ మాత్రమే కాదు, ఇది ఆంధ్ర గౌరవ చిహ్నం. ధైర్యం, మత సమన్వయం, సాంస్కృతిక వైభవం… కాకతీయులు ఎన్ని రహస్యాలు దాచారో? ఆ లోతుల్లోకి వెళ్తే ఇంకా ఎన్ని కథలు బయటపడతాయో కదా!

దేవత, గుమ్మడి, ఊరు… ఈ మూడింటిలో కాకతీయుల పేరు రహస్యం ఎక్కడ దాగుంది? ఆ అన్వేషణే చరిత్రలో ఒక ఆసక్తికరమైన అధ్యాయం. 

📢 కాకతీయుల పేరు రహస్యంలో మీరు ఏది నిజమని అనుకుంటున్నారు – దేవతా, గుమ్మడా, లేక ఊరా? 
💬 కింద కామెంట్స్‌లో చెప్పండి!

Leave a Comment