English  తెలుగు

భూమి నుంచి బ్రహ్మాండం వరకు: స్పేస్ టెక్నాలజీ శక్తి

మీ మొబైల్‌లో GPS ఎలా పని చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఆకాశాన్ని చూసి అక్కడికి మనిషి ఎలా వెళ్తాడు అని ఆలోచించారా? వీటన్నిటికీ సమాధానం స్పేస్ టెక్నాలజీ

Click here to Read the English version of this article.

స్పేస్ టెక్నాలజీ అంటే అంతరిక్షాన్ని అధ్యయనం చేయడానికి, అన్వేషించడానికి, ఉపయోగించడానికి రూపొందించిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం. రాకెట్లు, ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, టెలిస్కోపులు, స్పేస్ స్టేషన్లు ఇవన్నీ దీనికి ఉదాహరణలు. ఇవి వాతావరణ సూచనలు, కమ్యూనికేషన్, రక్షణ, పరిశోధన, నావిగేషన్, అంతరిక్ష ప్రయాణం లాంటి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తాయి.

సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ICT డిజిటల్ విప్లవం
డిజిటల్ విప్లవం: ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT)తో మారుతున్న ప్రపంచం

రాకెట్లను పంపడం, గ్రహాలను పరిశోధించడం మాత్రమే కాదు, మన జీవితాన్ని సులభతరం చేసే పరిజ్ఞానం కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే స్పేస్ టెక్నాలజీ మనిషిని భూమి హద్దులు దాటి విశ్వ రహస్యాల వైపు తీసుకెళ్తున్నది. 

స్పేస్ టెక్నాలజీ కక్ష్యల అధ్యయనం, లాంచ్ వెహికల్స్ రకాలు, కీలక కేంద్రాల అభివృద్ధి మొదలుకొని పలు రకాల అంశాలతో ఇమిడి ఉంటుంది. ఇది కేవలం శాస్త్రం కాదు, భవిష్యత్తుకు పునాది.

“Source of Strength is Science”: DRDO Revolutionizing Defence!
“బలస్య మూలం విజ్ఞానం”: DRDOతో రక్షణలో విప్లవం!

భారతదేశం ఈ రంగంలో అద్భుతాలను సృష్టించింది. 1962లో INCOSPARతో మొదలుపెట్టి, 1969లో ఇస్రో(ISRO)గా మారింది. SLV, PSLV, GSLV వంటి లాంచ్ వెహికల్స్‌తో అనేక ప్రయోగాలు జరిగాయి. 

ఆర్యభట్ట (1975), రోహిణి (1980), చంద్రయాన్-1 (2008), మంగళయాన్ (2013), ఆస్ట్రోసాట్ (2015), చంద్రయాన్-3 (2023), ఆదిత్య-L1 (2023) వంటి అనేక మిషన్లతో ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. శ్రీహరికోట, బెంగళూరు, తిరువనంతపురం వంటి కేంద్రాలు భారత అంతరిక్ష శక్తికి నిదర్శనాలు.

Tomorrow’s world… has already begun!
రేపటి ప్రపంచం… ఇప్పుడే మొదలైంది!

ఒకప్పుడు సైకిల్‌పై రాకెట్ భాగాలను మోసిన దేశం, ఇప్పుడు ఏకంగా మనిషిని పంపబోతోంది. భవిష్యత్తులో ఇంకెన్ని అద్భుతాలు చూడబోతున్నామో?

⚡ భవిష్యత్తులో అంతరిక్షం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ఊహించారా?
💬 మీ ఆలోచనల్ని కామెంట్స్‌లో పంచుకోండి…

Fueling India’s Future: Ministry of Science & Technology(MST)!
భారత్ భవిష్యత్తుకి ఇంధనం: సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ(MST)!