భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన నియమాలు, నిబంధనలు, చట్టాల రూపకల్పనతో పాటు వాటి అమలు బాధ్యతను నిర్వహించే కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ – మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
Click here to Read the English version of this article.
భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ను 1971 మే లో స్థాపించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింది విభాగాలను కలిగి ఉంది:
i) డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (DST)
ii) డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (DSIR)
iii) డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (DBT)
భారత్ లోని శాస్త్ర, సాంకేతిక రంగంలో వ్యక్తిగత విభాగాల పరిధిని మించి ఉన్న సవాళ్లు మరియు అంశాలను పరిష్కరించడానికి, 1999 నవంబర్‌లో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయాన్ని (Principal Scientific Adviser’s Office) కేబినెట్ సెక్రటేరియట్ స్థాపించింది. ఈ కార్యాలయం యొక్క విధులు – ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వడం, పలు రంగాల్లో ఉపయోగపడే సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేయడం కోసం విధానాలు, వ్యూహాలు, మిషన్‌లను రూపొందిస్తుంది.
ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకు డా. జితేంద్ర సింగ్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ (ఇండిపెండెంట్ చార్జ్)గా నాయకత్వం వహిస్తున్నారు మరియు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు(Principal Scientific Adviser)గా ఉన్నారు.
ప్రపంచ సమస్యలకు స్థానిక పరిష్కారాలు వెతుకుతున్న భారత్, సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త అధ్యాయాలను రాస్తోంది. మరింత సమాచారం కోసం భారత అధికారిక వెబ్సైట్ https://most.gov.in/ ను సందర్శించండి.
📢 సైన్స్ & టెక్నాలజీ రంగంలో భారత్ అడుగులు ఎలా అనిపించాయి?
💬 కామెంట్స్‌లో మీ ఫేవరెట్ పాయింట్ చెప్పండి…
