ఒక రాష్ట్రం పుట్టుక ఎన్ని మార్పులు తెచ్చుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆంధ్రప్రదేశ్ భౌగోళిక చరిత్ర చెప్పే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది.
Click here to Read the English version of this article.
1953 అక్టోబర్ 1 వ తేదీన కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల కలయికతో ‘ఆంధ్ర రాష్ట్రం’గా 11 జిల్లాలతో ప్రయాణం మొదలైంది. అప్పుడు రాజధాని కర్నూలు.
ఆ తర్వాత మూడేళ్లకే, 1956 నవంబర్ 1న తెలంగాణ కలిసి 20 జిల్లాలతో ‘ఆంధ్రప్రదేశ్’ అవతరించింది. హైదరాబాద్ రాజధానిగా, దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది.
కాలం గడిచింది. 2014లో రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ వేరైంది. మిగిలిన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని 13 జిల్లాలతో 2014 జూన్ 2వ తేదీన రాష్ట్ర పేరులో మార్పు లేకుండా ‘ఆంధ్రప్రదేశ్’గా తిరిగి ఏర్పడింది. రాజధాని అమరావతి.
కథ ఇక్కడితో ముగియలేదు. 2022లో రాష్ట్ర పటంలో మరో పెద్ద మార్పు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్తీకరణలో భాగంగా 2022 ఏప్రిల్ 4న కొత్తగా 13 జిల్లాలు ఏర్పడ్డాయి. మొత్తంగా 26 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మరింత విస్తరించింది. కోస్తాంధ్రలో 18 జిల్లాలు, రాయలసీమలో 8 జిల్లాలు.
భౌగోళికంగా చూస్తే, 12°41′ నుంచి 22° ఉత్తర అక్షాంశాలు, 77° నుంచి 84°40′ తూర్పు రేఖాంశాల మధ్య ఈ రాష్ట్రం వ్యాపించి ఉంది. సముద్రం, పర్వతాలు, నదులు – అన్నీ కలగలసిన భూమి ఇది.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రతి దశ ఒక గొప్ప మలుపు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి, భాషా ఉద్యమానికి మార్గం చూపించి, పునర్విభజన తరువాత కొత్త పునాదులు వేసుకుంటూ రాష్ట్రం ప్రయాణిస్తోంది.
ఇన్ని మార్పులు ఎందుకు? ప్రజల ఆశలు, పరిపాలనా అవసరాలు, రాజకీయ నిర్ణయాలు – మూడూ కలిసి పటం మర్చాయి. అయితే ఈ మార్పుల వెనుక ఉన్న అసలు కథలు ఏమిటి? అది తెలుసుకోవాలంటే ఇంకా లోతుగా వెతకాల్సిందే!
📢 మరి మీకు ఏ దశ అత్యంత ఆసక్తికరంగా అనిపించింది?
💬 కింద కామెంట్స్‌లో చెప్పండి…
