English  తెలుగు

58% భూమి, 40% జనాభా… కానీ గౌరవం శూన్యం!

మా నేల మా జనం మా హక్కులు… కానీ ఇవేం లేవు, ఎందుకు? ఇదే ఆంధ్రుల మనసులో రగిలిన ప్రశ్న.

Click here to Read the English version of this article. 

కుతుబ్ షాహీల పతనం తర్వాత తెలుగు మాట్లాడే ప్రాంతాలు విభజనకు గురయ్యాయి. తెలంగాణ నిజాం పాలనలో ఉండగా, కోస్తా – రాయలసీమ బ్రిటిష్ వారికి దక్కి, 1801లో లార్డ్ వెల్లస్లీ చేత మద్రాస్ ప్రెసిడెన్సీలో విలీనమయ్యాయి. 

విశాలాంధ్ర: తెలుగు జాతి ఐక్యతా స్వప్నానికి నాంది!
విశాలాంధ్ర: తెలుగు జాతి ఐక్యతా స్వప్నానికి నాంది!

అక్కడే సమస్య మొదలైంది. మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్రులకు గౌరవం లేదు. ఆంధ్ర మీద తమిళ ఆధిపత్యం రోజురోజుకీ పెరిగింది. పరిశ్రమలు, అభివృద్ధి అన్నీ తమిళ ప్రాంతానికే పరిమితమయ్యాయి. ఉద్యోగాల్లోనూ అన్యాయం బహిరంగం అయ్యింది. 

1911లో హిందూ పత్రికలో వచ్చిన గణాంకాలు ఆంధ్ర ప్రాంతంలోని ఉద్యోగాలలో ఆంధ్రుల స్థితి ఎంత వెనుకబడి ఉందో చూపించాయి.

From Sea Storms to Indian Shores: The Voyage of the Europeans!
సముద్ర తుఫాన్ల నుండి భారత తీరాల వరకూ: యూరోపియన్ల ప్రయాణం!
  • సబ్ కలెక్టర్: ఆంధ్రులు – 01, ఆంధ్రేతరులు – 03
  • డిప్యూటీ కలెక్టర్: ఆంధ్రులు – 21, ఆంధ్రేతరులు – 39
  • జిల్లా జడ్జిలు: ఆంధ్రులు – 0, ఆంధ్రేతరులు – 19
  • డిస్ట్రిక్ట్ మున్సిఫ్ లు: ఆంధ్రులు – 30, ఆంధ్రేతరులు:- 93
  • జిల్లా రిజిస్ట్రార్ లు: ఆంధ్రులు – 2, ఆంధ్రేతరులు – 17
  • విద్యాశాఖలో ఉన్నతోద్యోగులు: ఆంధ్రులు – 05, ఆంధ్రేతరులు – 28
  • రాష్ట్ర ఉన్నతోద్యోగులు: ఆంధ్రులు – 08, ఆంధ్రేతరులు – 56

ఈ అన్యాయాలు ఆంధ్రులలో ఆత్మగౌరవాన్ని రగిలించింది. తమకు ప్రత్యేక రాష్ట్రం అవసరమని గ్రహించారు. చరిత్ర పరిశోధనలు, సాంస్కృతిక ఉద్యమాలు, పత్రికల కథనాలు ఈ ఆలోచనను మరింత బలపరిచాయి. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదు. అది ఆత్మగౌరవం కోసం మొదలైన జ్వాల. 

ఆనాడు మొదలైన ఆ ఆత్మగౌరవ పోరాటం, నేటి తరానికి ఏమని చెబుతోంది? చరిత్ర పునరావృతం అవుతుందా?

From Pumpkin to a Roaring Empire, Three Tales, One Dynasty: The Secret Behind the Kakatiya Name!
గుమ్మడికాయ నుండి గర్జించే సామ్రాజ్యం, మూడు కథలు, ఒక రాజవంశం: కాకతీయుల పేరు రహస్యం!

📢 మీరే చెప్పండి – ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో ఏ సంఘటన మీ హృదయాన్ని ఎక్కువగా కదిలించింది?
💬 మీ ఆలోచనలు కింద కామెంట్స్‌లో పంచుకోండి…

ఆంధ్రప్రదేశ్ అన్'స్టాపబుల్': 70 ఏళ్లలో ఎన్నో మలుపులు!
ఆంధ్రప్రదేశ్ అన్’స్టాపబుల్’: 70 ఏళ్లలో ఎన్నో మలుపులు!