English  తెలుగు

సుస్థిర అభివృద్ధి: భవిష్యత్తు తరాల కోసం మన బాధ్యత

మన అభివృద్ధి –  పర్యావరణం, ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇదే ప్రశ్నతో 1970లలో సుస్థిర అభివృద్ధి అనే భావన ఆవిర్భవించింది.

ఈ ఆర్టికల్‌ను ఇంగ్లీష్‌లో చదవండి

1987లో  బ్రండ్‌ట్లాండ్ కమీషన్ “అవర్ కామన్ ఫ్యూచర్” నివేదికలో సుస్థిర అభివృద్ధిని ఇచ్చిన నిర్వచనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది: “ప్రస్తుత అవసరాలను తీరుస్తూ, భవిష్యత్తు తరాల అవసరాలను దెబ్బతీయకుండా చేసే అభివృద్ధి” గా నిర్వచించింది. సుస్థిర అభివృద్ధి మూడు స్థంభాలపై ఆధారపడి ఉంది: ఆర్థిక వృద్ధి, సామాజిక సమానత్వం, మరియు పర్యావరణ పరిరక్షణ. 

India HDI: What is the Level of Human Development?
భారత్ HDI: మానవ అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది?

2015లో ఐక్యరాజ్యసమితి 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDGs)ను 2030 నాటికి సాధించేందుకు నిర్ణయించింది. వీటిలో పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, వాతావరణ చర్య వంటి అంశాలు ఉన్నాయి. 

UN SDG నివేదిక 2025 ప్రకారం, భారత్ 167 దేశాల్లో 99వ స్థానంలో 67 స్కోర్‌తో నిలిచింది. ఇదే భారత్ మొదటిసారి టాప్ 100లో ప్రవేశించడం. పేదరిక నిర్మూలన, ఆర్థిక వృద్ధి, వాతావరణ చర్యల్లో భారత్ బాగా రాణించింది. అయితే, లింగ సమానత్వం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో మరింత పురోగతి అవసరం. ఫిన్లాండ్ (87.02), స్వీడన్ (85.74), మరియు డెన్మార్క్ (85.26) ప్రపంచ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, దక్షిణ సూడాన్ (41.55), సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (45.21), మరియు చాడ్ (46.04) అట్టడుగున ఉన్నాయి. 

నీతి ఆయోగ్(NITI Aayog) యొక్క SDG ఇండియా ఇండెక్స్ 2023–24 ప్రకారం, భారతదేశం యొక్క జాతీయ స్కోరు 71కి పెరిగింది, ఇది 2020–21లో 66 మరియు 2018లో 57 నుండి పెరిగింది. రాష్ట్రాల వారీగా చూస్తే, ఉత్తరాఖండ్ (79), కేరళ (79) తర్వాత తమిళనాడు (78)  అగ్రస్థానాల్లో ఉండగా, బీహార్ (57), జార్ఖండ్ (62), మరియు నాగాలాండ్ (63) అట్టడుగున ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో చండీగఢ్ (77) మరియు జమ్మూ & కాశ్మీర్ (74) ముందంజలో ఉండగా, లడాఖ్ (65) మరియు లక్షద్వీప్ (66) వెనుకంజలో ఉన్నాయి. 

India on the Path of Development: Where is the Indian Economy Headed in 2025?
అభివృద్ధి బాటలో భారత్: 2025లో భారత ఆర్థిక వ్యవస్థ ఎటు?

2018 మరియు 2023–24 మధ్య, ఉత్తర ప్రదేశ్ (+25), జమ్మూ & కాశ్మీర్ (+21), మరియు ఉత్తరాఖండ్ (+19) అత్యంత వేగవంతమైన పురోగతిని చూపించాయి. ప్రస్తుతం 32 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు 65–99 స్కోరు మధ్య ఉన్నాయి. “ఫ్రంట్ రన్నర్” విభాగంలోకి కొత్తగా 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు చేరి, భారతదేశం 2030 లక్ష్యాల వైపు స్థిరంగా సాగుతోందని సూచిస్తోంది.

విద్య, పేదరిక నిర్మూలన, వాతావరణ చర్యల్లో భారత్ గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, సుమారు 70% SDG లక్ష్యాలు ఇంకా పూర్తి కాలేదు. మరింత నిర్ణయాత్మక చర్యలు లేకుండా, 2030 నాటికి SDGలను సాధించడం భారతదేశానికి సవాలుగా ఉంటుంది.

సుస్థిర అభివృద్ధి ఎందుకు ముఖ్యమంటే, ఇది మనం భవిష్యత్ తరాలకు ఏం ఇవ్వగలుగుతున్నామనే విషయానికి సంబంధించినది. దీని కోసం నేడు మనం తీసుకునే చర్యలు, ఎటువంటి నష్టాన్ని కలిగించకుండా, తక్కువ ఖర్చుతో ఉంటూ రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తును అందిస్తాయి. ఇది మనకు మరియు భవిష్యత్ తరాలకూ లాభదాయకం. 

Indian Economy: The Magic of Three Sectors!
భారత ఆర్థిక వ్యవస్థ: మూడు రంగాల మాయాజాలం!

📢 భారత్ సుస్థిర అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోందని మీరు నమ్ముతున్నారా? భారతదేశం ఈ లక్ష్యాలను సమయానికి సాధించగలదా? మనం ఏ విధమైన మార్పులు తీసుకోవాలి?
💬 మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలపండి.