భారత రాజ్యాంగం ఒకే రోజులో రూపుదాల్చిన పత్రం కాదు. శతాబ్దాలుగా జరిగిన సంఘటనలు, యుద్ధాలు, ఒప్పందాలు, రాజకీయ ఆలోచనలు కలసి 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన ఈ అద్భుత పత్రానికి పునాది వేశాయి.
Click here to Read the English version of this article.
1600లో బ్రిటీష్ రాణి ఎలిజబెత్-1 ఇచ్చిన చార్టర్‌తో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపారం ప్రారంభించింది. 1608లో విలియం హాకిన్స్ సూరత్ ప్రాంతంలో వ్యాపార నిర్వహణకై మొఘల్ చక్రవర్తి జహంగీర్ నుండి అనుమతి పొందగా, 1615లో థామస్ రో మొత్తం భారత వ్యాపారానికి అధికారం సంపాదించాడు.
1757 ప్లాసీ యుద్ధం బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు నాంది పలకగా, 1764 బక్సర్ యుద్ధం బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు బలమైన పునాదులు వేసింది. 1765లో అలహాబాద్ ఒప్పందం, రాబర్ట్ క్లైవ్ బెంగాల్‌లో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనతో కంపెనీ అధికారాన్ని మరింత బలపరిచింది.
1773 నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభమై, పాలనా పద్ధతులు, చట్టాలు అమల్లోకి వచ్చాయి. 1857 సిపాయి తిరుగుబాటు తరువాత 1858లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసి, భారతదేశం నేరుగా బ్రిటిష్ క్రౌన్ (బ్రిటిష్ ప్రభుత్వం) అధీనంలోకి వెళ్లింది. అయితే రాజ్యాంగం లేకుండా పాలన సాగింది. ఈ కాలంలో వచ్చిన చట్టాలు, పరిపాలనా మార్పులు భారత రాజ్యాంగ రూపకల్పనపై గొప్ప ప్రభావం చూపించాయి.
రాజ్యాంగ చరిత్రకారుడు బి.సి. రావత్ రాజ్యాంగ పరిణామాన్ని ఆరు దశలుగా విభజించాడు: 1600-1773 (కంపెనీ స్థాపన), 1773-1858 (నియంత్రిత పాలన), 1858-1909 (క్రౌన్ పాలన), 1909-1935 (రాజనీతిక సంస్కరణలు), 1935-1947 (స్వయంపాలన), 1947-1950 (రాజ్యాంగ నిర్మాణం).
ప్రతి దశలో మార్పులు చివరకు 1946లో రాజ్యాంగ పరిషత్ ఏర్పడి, సుదీర్ఘ చర్చల అనంతరం 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నేడు భారత రాజ్యాంగం దేశ మౌలిక, సరోన్నత శాసనంగా నిలిచి, ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉంది.
వ్యాపారం కోసం వచ్చి, దేశాన్ని పాలించి, చివరికి ఒక సార్వభౌమ గణతంత్ర రాజ్య ఆవిర్భావానికి దారితీసిన ఈ పరిణామం అద్వితీయమైనది.
📢 మరి మీకు ఏ దశ ఎక్కువ ఆసక్తికరంగా అనిపించింది?
💬 కింద కామెంట్స్‌లో చెప్పండి…
